హైదరాబాద్, డిసెంబర్ 29(జనంసాక్షి): తెలంగాణలో వివిధ శాఖల మంత్రులకు అనుబంధంగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించారు. సీఎంకు అనుబంధంగా జలగం వెంకట్రావు, వినయ్‌భాస్కర్, విద్యాశాఖా మంత్రికి అనుబంధంగా సతీశ్‌కుమార్, వైద్యశాఖ మంత్రికి అనుబంధంగా గాదరి కిశోర్‌కుమార్, రెవెన్యూశాఖ మంత్రికి అనుబంధంగా శ్రీనివాస్ణ్‌ొడ్, వ్యవసాయశాఖ మంత్రికి అనుబంధంగా కోవా లక్ష్మీలను నియమించారు. ఈ మేరకు పార్లమెంటరీ కార్యదర్శుల అధికారాలు, బాధ్యతలను పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం వారు సహాయ మంత్రుల ¬దాలో బాధ్యతలు నిర్వహిస్తారు.

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం




