Tuesday, 3 November 2026

ఎమ్మెల్యే వివేక్ పై పీఎస్ లో కేసు..

n541kz2fహైదరాబాద్ : ఎమ్మెల్యే వివేక్ పై ఆయన సమీప బంధువు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశాడని అతను ఆరోపించారు. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే వివేక్ అతని సమీప బంధువైన విశాల్ కు మధ్య చింతల్ లో ఉన్న స్థలంపై వివాదం ఉంది. ఆ స్థలం తనదేనని విశాల్ వాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే దీపావళి పండుగ సందర్భంగా ఆ స్థలంలో కొందరు టపాసుల దుకాణం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న విశాల్ అక్కడకు చేరుకున్నాడు. తన అనుమతి తీసుకోకుండా దుకాణం ఎలా ఏర్పాటు చేస్తారని నిర్వాహకులను ప్రశ్నించాడు. తాము ఎమ్మెల్యే అనుమతి తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు సదరు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సమాచారం ఎమ్మెల్యే వివేక్ కు తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకున్నాడు. వివేక్..విశాల్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో తనపై దాడి చేశాడని విశాల్ జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. చికిత్సకు సంబంధించిన పేపర్లను కూడా నమోదు చేశాడు. ఘటన జరిగినప్పుడు వీడియో తీస్తున్న అతడిని కూడా ఎమ్మెల్యే కొట్టడం జరిగిందని, ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తే సహించేది లేదని విశాల్ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *