Tuesday, 3 November 2026

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారపు బిస్కెట్లు ప‌ట్టివేత‌

11

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేసి.. ప్రయాణికురాలని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి… బ్యాంకాక్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చిన మహిళను తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు సోదా నిర్వహించారు.

ఈ సందర్భంగా సదరు ప్రయాణికురాలి నడుముకు బంగారపు బిస్కెట్లు చుట్టుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బంగారపు బిస్కెట్లు స్వాధీనం చేసుకుని.. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బంగారం 4.5 కేజీలు ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన మహిళ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కడప నగరం అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *