Monday, 2 November 2026

ఎయిర్‌ ఏషియా జలసమాధి

నలభై పైగా మృతదేహాల లభ్యం1

విమానంలో 162 మంది ప్రయాణికులు

జావా సముద్రంలో శకలాలు

కొనసాగుతున్న సహాయక చర్యలు

జకార్తా,డిసెంబర్‌30(జనంసాక్షి):  సముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ ఏషియా విమానం ప్రమాదం ఘటనలో మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 40కి పైగా మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు చర్యలను వేగవంతం చేశారు. విమానం కూలిపోయినట్టుగా ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించిన ప్రాంతంలో తొలుత శకాలలను గుర్తించారు. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతుండటంతో వాటిని వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ డైరెక్టర్‌ ఎస్‌.బి. సుప్రియాదీ తెలిపారు. ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. గాలింపు చర్యలనుకొనసాగిస్తున్నారు. ఇదిలావుంటే తమ వారి శవాల కోసం వారిబంధువుల ఆర్తిగా ఎదురు చూస్తున్నారు.

మలేషియా విమానం ప్రమాదానికి గురికావడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.20 గంటలకు బయల్దేరిన ఈ విమానం 8.30 గంటలకు సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి చేరుకోవాలి. జావా సముద్రం విూదుగా వెళ్తూ ఉదయం 7.24 గంటలకు సంబంధాలు కోల్పోయింది. దీంతో ఇప్పుడీ విమానం సముద్రంలో కూలిందా లేక, ఎవరైనా కూల్చివేశారా లేక ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని కూలిపోయిందా అన్నది మిస్టరీగా మారింది. తక్కువ ధరతో సేవలందించడంలో పేరొందిన ఎయిర్‌ఏషియా దాదాపు వంద గమ్యస్థానాలకు విమానాలు నడిపిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *