ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. ఐదుగురు పేర్లతో కూడిన స్మగ్లర్ల జాబితాను చిత్తూరు జిల్లా పోలీసులు ఈడీకి అందించారు. ఈ జాబితాలో వైసీపీ నేత విజయానంద రెడ్డి, చెన్నైకి చెందిన వెంకటేష్, ఆర్ సెల్వరాజ్, ఢిల్లీకి చెందిన సుశీల్ విక్రమ్ మహందీ, కర్ణాటకకు చెందిన పఠాన్ రియాజ్ ఖాన్ ల పేర్లున్నాయి. వీరి ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ఈడీ సిద్ధమైనట్లు సమాచారం.