Tuesday, 3 November 2026

ఎర్రన్నాయుడుకు నివాళి

శ్రీకాకుళం,నవంబర్‌2(జ‌నంసాక్షి): కింజరాపు యర్రన్నాయుడు వర్ధంతి సందర్బంగా ఆయనకు నేతలు ఘనంగా నివాళి అర్పించారు. స్థానికకూడలిలో గల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కె.రామ్మోహన్‌ నాయుడు, కుటుంబ సభ్యులు, ఎం.ఎల్‌.ఏ గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.