– డబుల్‌బెడ్‌రూంలను పరిశీలించిన సీఎం
– అంకాపూర్ తరహా వ్యవసాయం
– ముఖ్యమంత్రి కేసీఆర్
ఎర్రవల్లిలో ఇండ్లను పరిశీలించిన సిఎం కెసిఆర్
డ్రిప్ ఇరిగేషన్‌తో సమిష్టి వ్యవసాయానికి ప్రోత్సాహం
మెదక్,మార్చి4(జనంసాక్షి): ఎర్రవల్లి వాసులు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ఇతరప్రాంతాలు ఇక్కడి నుంచి పాఠాలు నేర్చుకునేందుకు రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోదాం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మహిళల సహకారంతో కలసికట్టుగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం. ఎర్రవల్లిలో వ్యవసాయ పనులను సామూహికంగా నిర్వహించాలి. పంటకు కావాల్సిన మందులను రైతులు సామూహికంగానే చల్లాలి. గ్రామాల్లో డ్రిప్ ఇరిగేషన్ పనులను రైతులు పరిశీలించాలి. పొత్తులో వ్యవసాయం చేస్తూ ముందుకు పోవాలంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం భూగర్భ జల వనరులను వీలైనంతగా వినియోగించుకుందాం’ అని అన్నారు. అనంతరం ఎర్రవల్లిలో నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇళ్లను కేసీఆర్ పరిశీలించారు. ఇళ్లన్నీ హైదరాబాద్ గ్రేటర్ విల్లాలను మరిపిస్తున్నాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇంత అద్భుతంగా నిర్మించిన అధికరాఉలను ఆయన అభినందించారు. ఇలాగే రాష్ట్రమంతటా నిర్మిస్తామని అన్నారు. దశలవారీగా కార్యక్రమం చేపడతామని అన్నారు. ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి ఇళ్లను పరిశీలించారు. ఎర్రవెల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను సీఎం పరిశీలించారు. సీఎం వెంట మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. అనంతరం ఎర్రవెల్లి గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… రాష్ట్రంలో పెద్ద యజ్ఞాన్ని తలపెట్టినం. ఎర్రవెల్లి చుట్టూ ఉన్న నాలుగు కుంటలను బాగు చేస్తున్నం. కూడవెల్లి వాగు విూద చెక్‌డ్యాంలు కడుతున్నం. ఈ నీటితో ఎర్రవెల్లి, నర్సన్నపేటలో మూడు పంటలు పండించాలన్నారు. పంటలకు డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నప్పుడు రైతులందరూ గమనించాలి. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో 2800 ఎకరాల వ్యవసాయం ఉంది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు అన్ని పొలాలకు నీళ్లందుతాయి. డ్రిప్ ఇరిగేషన్ ఏజెన్సీ నీటిపారుదల పనులను చూసుకుంటుంది. డ్రిప్ ద్వారానే ఎరువుల పంపిణీ జరుగుతుంది. పొలాలన్నింటికి ఒకే సారి పురుగుల మందు స్ప్రే చేస్తాం. ఇండ్లలో, వీధుల్లో చెట్లు నాటుతాం. ఎర్రవెల్లి మొత్తం ఆకుపచ్చగా కనిపించాలి. భారతదేశానికి ఎర్రవెల్లి కొత్తపాఠం నెర్పించాలి. తెలంగాణ భారతదేశానికి ఆదర్శం కావాలని
అన్నారు. ఎర్రవెల్లిలో అభివృద్ధి సాధించిన అధికారులను అభినందిస్తున్నా. ఐక్యమత్యంగా ఉన్నాం కాబట్టే అభివృద్ధి సాధిస్తున్నాం అని చెఓప్పుకొచ్చారు. కష్టపడి సాధించుకుఏన్న తెలంగాణను పచ్చగా అభివృద్ది చేఉకోవడమే మన బాధ్యతని అన్నారు. మే 15లోపు ఇండ్లు పూర్తవుతాయి. నల్లాలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తాం. మే 30 లోపు గృహప్రవేశం చేసుకుందాం. మంచి ముహూర్తం చూసి నేనే ప్రారంభం చేస్తా. డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై వాటర్ ట్యాంక్‌లు నిర్మిస్తున్నాం. ఎర్రవెల్లిలో మహిళలు బిందెలు పట్టుకొని బోరింగ్ వద్ద నిలబడే పరిస్థితి ఉండదు. బిందెలు పట్టుకుని ఆడబిడ్డ రోడ్లపై కనిపిస్తే సర్పంచ్ రాజీనామా చేయాలి. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ దగ్గరుండి ఇంటింటికి నల్లా బిగించాలని తెలిపారు. మెదక్ జిల్లా లోని ఎర్రవెల్లి తరహాలోనే కరీంనగర్ లోనూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం త్వరగా చేసి గృహప్రవేశాలు నిర్వహించాలని భావించాం, అయితే ఆ జిల్లా అధికారులు యాక్టివ్ గా లేరంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వారంతా ఇక్కడికే వచ్చి పనుఏలను పరిశీలించారని అన్నారు. అదేవిధంగా ఎర్రవెల్లికి గోదావరి జలాలు తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 7న గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. అనంతరం ఎర్రవెల్లి నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు.





