Tuesday, 3 November 2026

ఎవరిని వదిలి పెట్టేది లేదు

నానక్‌రాంగూడ ప్రమాద ఘటనకు కారణమైన బాధ్యులను వదిలేది లేదని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి స్వయంtelangana-state-ministerktrగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని అభిప్రాయపడ్డారు. భవన యజమాని సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తుసింగ్ పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని చెప్పారు. అతని కొడుకు అనిల్‌సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయతే, సత్తుసింగ్ ఓ మంత్రి బంధువుగా ఆరోపణలు వస్తున్నాయని, బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. క్షేత్రస్థాయిలో విధులు సక్రమంగా నిర్వర్తించని కారణంగా సర్కిల్ 11 (శేరిలింగంపల్లి) డిప్యూటీ కమిషనర్ మనోహర్, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంటు సిటీ ప్లానర్ కృష్ణమోహన్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇదిలావుంటే, భవనం కుప్పకూలిన దుర్ఘటనలో శుక్రవారం సాయంత్రానికి ఆరు మృతదేహాలను బయటకు తీశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *