ఎసిబి వలలో వైద్య ఉద్యోగి

నెల్లూరు,మే10(ఆర్‌ఎన్‌ఎ):: జిల్లా వైద్యఆరోగ్య శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాల్‌ ఓ ఉద్యోగి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. సర్వీస్‌ రెగ్యులర్‌ చేసేందుకు మహేష్‌ అనే ఉద్యోగి నుంచి రూ 30 వేలు డిమాండ్‌ చేశాడు సూపరింటెండెంట్‌ పయ్యావుల శ్రీనివాస్‌. రూ 25 వేలు లంచాన్ని సీనియర్‌ సహాయకులు ద్వారా ఇవ్వాలన్నారు. దీంతో మహేష్‌ ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఈ రోజు ఉదయం శ్రీనివాస్‌కు డబ్బులు ఇస్తూండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

తాజావార్తలు