Wednesday, 4 November 2026

ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ

కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ జరిగింది. జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్ల గ్రామాన్ని ఎస్పీ రవికృష్ణ దత్తత తీసుకున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో ఆయా సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. కక్షల నుంచి బయటపడి స్వయం ఉపాధి మార్గాలు, విద్య తదితర అంశాలపై ఆయన అక్కడి యువతలో చైతన్యం తీసుకువస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం కోడుమూరు నుంచి కప్పట్రాళ్ల గ్రామం వరకు ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ జరిగింది. ఈర్యాలీలో కొడుమూరు, కప్పట్రాళ్ల తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు భారీగా విచ్చేసి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *