హైదరాబాద్ :నల్గొండ జిల్లా జానకీపురం వద్ద ఎన్ కౌంటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్ధయ్య 4 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ మంగళవారం సాయంత్రం 4గంటల 6 నిమిషాలకు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మెదడులో తీవ్ర రక్త స్రావం కావడంతో వైద్యానికి బాడీ సహకరించలేదని తెలుస్తోంది. దీంతో అదే ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం మగపిల్లవాడికి జన్మనిచ్చిన సిద్ధయ్య భార్యకుటుంబ సభ్యులు శోక సముద్రంలో ముగినిపోయింది. మరోవైపు సిద్ధయ్య మరణవార్త విని నల్లొండ జిల్లా పోలీసులను కూడా కలచివేసింది. కాగా దుండగుల కాల్పుల్లో సిద్ధయ్య శరీరంలో 4 బుల్లెట్లు దూసుకు పోయిన విషయం తెలిసిందే. దాంతో 10 మందితో కూడిన వైద్య బృందం ఇప్పటి వరకు ఆయనకు 3 శస్త్రచికిత్సలు చేసింది. సుమారు 8 గంటల పాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో 40 యూనిట్లు రక్తం అవసరం కాగా 30 మంది ట్రాఫిక్ పోలీసులు రక్త దానం చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధయ్య మృతదేహాన్ని కామినేని మార్చుకి తరలించారు. కొన్ని పరీక్షల అనంతరం ఉస్మానియా మార్చురీకి తరలించి పోస్టు మార్టం నిర్వహించి అనంతరం సిద్ధయ్య స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు తరలించనున్నట్లు సమాచారం. సిద్ధయ్య పార్దీవ దేహాన్ని చివరిసారి చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు.
ఎస్ ఐ సిద్ధయ్య మృతి




