కడప: ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న హోంగార్డును రాజంపేట ఎన్‌బీఐ అధికారులు పట్టుకున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితున్ని పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. నిందితున్ని చిత్తూరు జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న బాలాజీగా గుర్తించారు. అతన్ని పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.




