సూళ్లూరుపేట : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వట్రపాలెంలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. అక్రమ సంబంధానికి అడ్డం వస్తుందనే కారణంతో బాలికను తల్లి అలివేలు హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం తల్లి పరారీలో ఉంది.




