Wednesday, 4 November 2026

అగ్ని ప్రమాదం వల్ల పత్తి మిల్లు దగ్ధం

ప్రకాశం : మార్టురు-జొన్నతాళి రహదారిలో ఓ పత్తి మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *