గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో సెల్‌టవర్ ఎక్కి నిరాహార దీక్ష చేస్తున్న సంజీవరావు..19గంటలుగా దీక్షను ఇంకా కొనసాగిస్తున్నారు. నిన్నటి నుండి సెల్‌టవర్‌పైనే ఉన్న సంజీవరావు రాత్రంతా అక్కడే గడిపాడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని..అప్పటివరకు టవర్ దిగేది లేదని సంజీవరావు స్పష్టం చేశారు. మరోవైపు సంజీవరావు నిన్నటి నుండి సెల్‌టవర్‌పైనే ఉండి నిరాహార దీక్ష చేస్తుండడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తన భర్తను సురక్షితంగా కిందకు దింపాలను అధికారులను వేడుకుంటున్నారు. అయితే అధికారులు ఎంత ప్రయత్నం చేసినా సంజీవరావు కిందకు దిగనని మొండికేసి కూర్చున్నారు. అతన్ని కిందికి దించేందుకు పోలీసులు కొంత మందిని సెల్ టవర్ ఎక్కించేందుకు ప్రయత్నించగా.. వారిని టవర్ ఎక్కిస్తే…తాను అక్కడి నుంచి దూకి ఆత్మహ్యత చేసుకుంటానని బెదిరించారు. దీంతో పోలీసులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే ఇవాళా సంజీవరావు బంధువులను టవర్ ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.




