Tuesday, 3 November 2026

ఏపీకి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో సెక్యూరిటీగార్డు ఆత్మహత్య

నెల్లూరు, సెప్టెంబరు 4 : ఏపీకి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో ఓ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య (40) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రమణయ్య ఆత్మహత్యకు ముందు నెల్లూరు జిల్లా కలెక్టరు పేరిట మూడు సూసైడ్‌ నోట్‌లు రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాక గ్రామం అభివృద్ధి చెందటం లేదని, పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి బావిలోనుంచి మృతదేహాన్ని వెలికితీసేందుకు సన్నాహాలు ఆరంభించారు. ఈ విషయం తెలిసిన జనం పెద్దసంఖ్యలో బావి వద్దకు వచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *