Thursday, 5 November 2026

ఏపీ,తెలంగాణ ప్రజలుకు దసరా శుభాకాంక్షలు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

viv0vgttఅమరావతి, అక్టోబర్ 22 : అమరావతి శంకుస్థాపన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఏపీ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. దసరా పర్వదినాన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం శుభప్రదమని కేసీఆర్ అన్నారు.
 అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున ఏపీ ప్రజలు, ప్రజానిధులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని…అమరావతి ప్రపంచంలోనే అద్భుత నగరంగా నిర్మాణం కావాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతి అభివృద్ధి కోసం అవసరమై అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *