Monday, 2 November 2026

ఏపీ కి రూ.2,500కోట్ల నగదు

chandrababunaiduసమయపాలన లేకుండా ప్రజల సౌకర్యార్థం పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. నగదు రహిత లావాదేవీలపై ఆర్థికశాఖ అధికారులు, కలెక్టర్లు, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ రోజు రూ.2,500కోట్ల నగదు రాష్ట్రానికి చేరిందని, విశాఖ, కడప, అనంతపురం, తిరుపతికి విమానాల్లో నగదు పంపిణీ చేస్తున్నామన్నారు. మిగిలిన ప్రాంతాలకు రోడ్డు మార్గాల ద్వారా నగదు పంపిణీ జరుగుతుందన్నారు. మధ్యాహ్నంలోగా అన్ని బ్యాంకులకు నగదు పంపిణీ జరుగుతుందని, సాయంత్రానికి నగదు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *