Tuesday, 3 November 2026

ఏపీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

విజయవాడ, ఆగస్టు 5 : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కౌన్సెలింగ్‌ బుధవారం ఉదయం ప్రారంభమైంది. తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. విశాఖ, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో కౌన్సెలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 11వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ జరుగనుంది. కౌన్సెలింగ్‌ కేంద్రాల వద్ద విద్యార్థులకు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులకు అన్ని సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *