ఏపీ సీఎం, స్పీకర్‌ను కలిసిన శైలజానాధ్
– నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే కలిశా
– రాజకీయంగా ఎలాంటి చర్చజరగలేదు
– విూడియాకు వెల్లడించిన శైలజానాథ్
అమరావతి, జులై18(జనం సాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్‌లతో మాజీ మంత్రి శైలజానాధ్ బుధవారం భేటీ అయ్యారు. ఉదయం చంద్రబాబుతో భేటీ అయిన శైలజానాధ్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అనంతర స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలిసి విూడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలు, మెడికల్ ఇన్సూరెన్స్ సమస్యలపై స్పీకర్‌తో చర్చించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ నేతలను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మాజీ మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. పోలవరంపై ఫోకస్ పెట్టాల్సిందిగా కోరానని చెప్పినట్లు తెలిపారు. సచివాలయానికి వెళ్లి సంబంధిత అధికారులు.. మంత్రులను ప్రతిపక్ష నేతలు కలిస్తే తప్పేంటీ..? ప్రతిపక్ష నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారం కోసం ఇక్కడికి రావద్దా అని ప్రశ్నించారు.