Tuesday, 3 November 2026

ఏయూ ఇంజనీరింగ్‌ ప్రశ్నాపత్రం లీక్‌

విశాఖ, జనంసాక్షి: ఆంధ్ర యూనివర్శిటీలో ప్రశ్నా పత్రాల లీకేజీ భాగోతం బయటపడింది. ఇంజనీరింగ్‌ ప్రశ్నాపత్రాలు ఒకరోజు ముందుగానే ఈ- మెయిల్‌ ద్వారా విద్యార్థులకు చేరుతున్నాయి. ఒక్కో ప్రశ్నా పత్రాన్ని పదివేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం, ఏలూరులో ఇంజనీరింగ్‌ ప్రశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఏయూ పరిధిలో జరుగుతున్న మేధ్స్‌-2 పరీక్షను అధికారులు రద్ధు చేశారు. లీకేజీ వ్యవహారం అధికారులు పోలీసులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *