Monday, 2 November 2026

ఏసీబీకి చిక్కిన నెల్లూరు జిల్లా ఆడిటర్

నెల్లూరు : పెన్షన్ బిల్లులు మంజూరు చేయడానికి ఓ వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ జిల్లా ఆడిటర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం వెలుగుచూసింది. జిల్లాకు చెందిన బూడిద శ్రీనివాసులు అనే వ్యక్తి పెన్షన్ బిల్లుల కోసం జిల్లా ఆడిట్ అధికారి షణ్ముఖరెడ్డిని ఆశ్రయించాడు. బిల్లు మంజూరు చేయాలంటే రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు.

దీంతో శ్రీనివాసులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ ఆడిటర్ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షణ్ముఖరెడ్డితోపాటు సీనియర్ ఆడిటర్ వహీద్‌బాషాను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *