
హైదరాబాద్,జనవరి12(జనంసాక్షి): పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వరగంల్ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా అక్కడి అధికారులకు స్థాన చలనం కలిగించారు. ఇక్కడ కలెక్టర్ సహా ముగ్గురు అధికారులను బదిలీ చేసి వారికి షాక్ ఇచ్చారు. ఆంధప్రదేశ్ నుంచి తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లతోపాటు ఇప్పటికే తెలంగాణలో పనిచేస్తున్న వారికి కూడా పోస్టింగ్‌లు ఖరారు చేసింది. మొత్తం 24 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. టిటిడి ఇవోగా పనిచేసి వచ్చిన ఎంజి గోపాల్‌కు ప్రధానమైన మున్సిపల్ వ్యవహారాల శాఖను ఇచ్చారు. ఇక బదిలీల్లో మహిళలకు పెద్దపీట వేశారు. ఐదు జిల్లాలకు కొత్తగా కలెక్టర్లను మహిళలనేనియమించారు. ఏడు జిల్లాలకు కొత్తగా కలెక్టర్లను నియమింగా అందులో ఐదు జిల్లాలకు మహిళా ఐఏఎస్‌లే కలెక్టర్లుగా నియమితులయ్యారు. అలాగే ఐదుగురు ఐఏఎస్‌లను జీహెచ్‌ఎంసీకి కేటాయించడం గమనార్హం. మున్సిపల్ పరిపాలనశాఖలో ఉన్న శైలేంద్ర కుమార్ జోషీని భారీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అలాగే విద్యాశాఖలో వికాస్‌రాజు ఆంధ్రకు వెళ్లడంతో ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ ఆచార్యను ప్రభుత్వం నియమించింది. ఆంధ్ర నుంచి వచ్చిన నవీన్ మిట్టల్‌ను జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు.
మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా టిటిడి నుంచి వచ్చిన ఎంజీ. గోపాల్ కు కేటాయించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆర్‌ఆర్ ఆచార్య నియమితులయ్యారు. జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్లుగా నవీన్ మిట్టల్, వీరబ్రహ్మయ్యలను నియమించారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా ….జి.కిషన్, గౌరవ్ ఉప్పల్, పౌసమి బసు నియమితులయ్యారు. ఇందులో కిషన్ వరంగల్ కలెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్ కలెక్టర్‌గా కె.నిర్మల, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎం.రఘునందన్‌రావు, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీ, కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నీతూకుమారి ప్రసాద్, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా కరుణ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా జీడీ ప్రియదర్శిని నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పి.సత్యనారాయణరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా టీకే శ్రీదేవి, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్‌గా కె.సురేంద్రమోహన్, ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్ పాల్వంచ సబ్‌కలెక్టర్‌గా కాళీచరణ్, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్‌గా ఆర్‌జీ హనుమంతు, వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా అలుగు వర్షిణి, జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా కృష్ణభాస్కర్, వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రశాంత్‌జీవన్, రంగారెడ్డి జిల్లా మరో జేసీగా హరిచందన, సీఆర్‌వో హైదరాబాద్-భారతి వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు. ఇందులో ప్రియదర్శిని ఇప్పటి వరకు ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేశారు.




