Tuesday, 3 November 2026

ప్రముఖ దర్శ, నిర్మాత వి.బి రాజేంద్రప్రసాద్‌ ఇకలేరు

3హైదరాబాద్‌, జనవరి12(జనంసాక్షి): జగపతి సంస్థను స్థాపించి అనేక హిట్‌ చిత్రాలను నిర్మించి, కొన్నింటికి తానే స్వయంగా దర్శకంతం వహించి మంచి నిర్మాత, ఉత్తమ దర్శకుడు అని ప్రఖ్యాతి సాధించిన వి.బి రాజేంద్రప్రసాద్‌ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆయన ఇషా ఆసుపత్రిలో చికిత్స పొందారు.  వి.బి రాజేంద్రప్రసాద్‌ పూర్తి పేరు వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్‌. ప్రముఖ నటుడు జగపతిబాబు రాజేంద్రప్రసాద్‌ కుమారుడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడలో 1932 నవంబరు 4న జన్మించారు. తెలుగులో మేటి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. రాఘవ కళాసమితి ద్వారా రాజేంద్రప్రసాద్‌ రంగస్థలానికి పరిచమయ్యారు.

బి.వి.రాజేంద్రప్రసాద్‌ సినీ ప్రస్థానం

జగపతి ఆర్ట్స్‌ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వి.బి.రాజేంద్రప్రసాద్‌ తొలుత నాటకాలు వేసేవారు. రాఘవ కళాసమితి ద్వారా ఆయన రంగస్థలానికి పరిచయమయ్యారు. నటుడు అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా స్ధిరపడ్డారు. 1960లో అన్నపూర్ణ చిత్రంతో నిర్మాతగా మారారు. 16 చిత్రాలను నిర్మించారు. 1965లో అంతస్తులు చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన దసరాబుల్లోడు చిత్రంతో ఆయన మెగాఫోన్‌ పట్టి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. మొత్తం 14 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కెప్టెన్‌ నాగార్జున, బంగారుబాబు చిత్రాలకు రచయితగా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *