Monday, 2 November 2026

ఐక్యరాజ్య సమితి ప్రచారకర్తగా మన సానియా

3

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా విూర్జా ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా నియమితులయ్యారు. సానియాను ఈ మేరకు ఐరాస ప్రచారకర్తగా నియమించింది. సానియా దక్షిణాసియా దేశాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐరాసతో కలిసి పనిచేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా సానియా వ్యవహరిస్తున్నారు. భారత టెన్నీస్‌ స్టార్‌ క్రీడాకారిణి సానియా విూర్జా మరో ఘనత సాధించారు. దక్షిణాసియాలో మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితితో కలిసి సానియా విూర్జా పని చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి తనకు ఇచ్చిన బాధ్యతను శక్తి మేర నెరుస్తానని సానియా విూర్జా ఈ సందర్భంగా అన్నారు. స్త్రీలపై హింస నిర్మూలనకు అడ్డంకులను ఎదురొడ్డి పోరాడుతానని చెప్పారు. సమాజంలో మహిళలపై వివక్ష కొనసాగుతోందని సానియా అభిప్రాయపడ్డారు. స్త్రీలపై కొనసాగుతున్న వివక్షను రూపుమాపేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *