ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తాం
సర్కారీ దవాఖానాలపై సభలో వాడీవేడీ చర్చ
హైదరాబాద్, నవంబర్ 25 (జనంసాక్షి) : పరిశ్రమలకు సింగిల్‌విండో విధానం కోసం చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహకాలు అందిస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తామని సర్కారు ప్రకటించింది. ప్రభుత్వ దవాఖానాలపై మంగళవారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. వరంగల్ నగరంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా నూతన పారిశ్రామిక విధానం అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ప్రస్తావించారు. అసలు ఎప్పటిలోగా నూతన పారిశ్రామిక విధానం అమలులోకి తెస్తారని గీతారెడ్డి ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏమైనా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎస్సీ పారిశ్రామికవేత్తలను పట్టించుకోవడం లేదని తెలిపారు. బ్యాంకర్లు కూడా తిప్పుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీలను కించపరిచామని అధికార సభ్యులు అనడం సరికాదన్నారు. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగింది కాంగ్రెస్ పాలనలోనే చెప్పారు. దళితులు, గిరిజనులకు తాము చేసినంత ఎవరూ చేయలేదన్నారు. మాకంటే బాగా చేయాలనుకుంటే విూరు చేయండి.. మేం తప్పకుండా సహకరిస్తాం, అభినందిస్తామని చెప్పారు.
దీనికి కేటీఆర్ సమాధానమిస్తూ..
పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. పరిశ్రమలతోనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. విద్యుత్ సమస్యపై దీర్ఘకాలిక ప్రణాలికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాదికి రెండు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తపికి బిడ్స్ వచ్చాయని వివరించారు. దళితులు, గిరిజనులనే కాకుండా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ యువతకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. అలాగే, సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ పాలసీని తీసుకురానున్నట్లు వివరించారు.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు
విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా.. తెలుగు అకాడవిూలో జరిగిన అవకతవకలు, సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెలుగు అకాడవిూలో అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. పదేళ్లుగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇంటర్ బోర్డును ఏలుతూ ఇష్టమొచ్చినట్లు జీవోలు ఇప్పించుకున్నాయని విమర్శించారు. గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని సభకు హావిూ ఇచ్చారు. పాఠశాలలకు సకాలంలోనే పుస్తకాలు అందించామని, కానీ పంపిణీలో ఆలస్యం జరిగిందని అంగీకరించారు. సామాజికశాస్త్రం పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని తెలిపారు. అధిక ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. విద్యార్థులపై భారాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పాఠ్యపుస్తకాల అంశంపై సభలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పుస్తకాలు అమ్మకాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, పుస్తకాల ధరలు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులపై పుస్తకాల కొనుగోళ్లలో అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు అందలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. నకిలీ పుస్తకాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని కోరారు. ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరిస్తాం
సర్కారీ దవాఖానల దుస్థితిపై శాసనసభలో మంగళవారం వాడివేడి చర్చ జరిగింది. ఆస్పత్రుల్లో వసతుల లేమి, వైద్యుల కొరతపై విపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం తెలిపింది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు నిధులు కేటాయించినట్లు పేర్కొంది. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. సర్కారీ దవాఖానాల్లో కనీస సౌకర్యాలు లేవని, వైద్యులు సమయానికి రావడం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల మెరుగుదలకు ఏం చర్యలు తీసుకుంటున్నాయని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య సమాధానమిస్తూ.. సమైక్య పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు నిరాదరణకు గురయ్యాయని విమర్శించారు. వాటిని ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. అందులో భాగంగానే క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకొనేందుకు అన్ని ఆస్పత్రులు తిరిగామని చెప్పారు. తెలంగాణలోని ఆస్పత్రులను తాను సందర్శించానని, అక్కడి పరిస్థితులు గమనించాని తెలిపారు. దవాఖానాల్లో మౌలిక సౌకర్యాల మెరుగు కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పారు.
మంత్రి సమాధానంపై విపక్షాల ఆగ్రహం
అయితే, మంత్రి సమాధానంపై ప్రతిపక్షాలు తీతవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యేలు అసదుద్దీన్ ఒవైసీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ప్రభుత్వంపై మండిపడ్డారు. మంత్రి ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తే ఎలా? అని ఒవైసీ నిలదీశారు. బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించామంటున్నారు.. ఆ నిధులు ఎక్కడెక్కడ కేటాయించారో చెప్పాలని ప్రశ్నించారు. ఉస్మానియా, నిలోఫర్, గాంధీ, క్యాన్సర్ ఆస్పత్రులను పరిశీలించాలని, వాటిలో ఏమాత్రం సౌకర్యాలు లేవని, చివరకు సెక్యూరిటీ గార్డులు కూడా లేవని ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో అవసరమైన మేరకు సిబ్బంది లేరని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలపై మండిపడుతూ.. రాజకీయ ప్రసంగాలు వద్దని, తమకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం అడిగితే సభ్యుడ్ని తప్పుబడుతున్నారు.. ఇదేం పద్ధతని మండిపడ్డారు. ఆస్పత్రుల్లోని కీలక పరికరాలు పని చేయడం లేదని మండిపడ్డారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులో చాలా సమస్యలు ఉన్నాయని, ఉన్న పరికరాల్లో సగం పక్కన పడేశారని విమర్శించారు.
వైద్యులు, వసతుల కొరత
వైద్యాశాఖ మంత్రి అసలు ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించారా? ఒక్కసారైనా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారా? అని అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. బీబీనగర్ నిమ్స్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందో చెప్పాలని కోరారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్తితుల మెరుగు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సర్కారీ దవాఖానాలను నిర్లక్ష్యం చేయడం దారుణమని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో ప్రముఖమైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఉస్మానియాలో ఐదు నెలల్లో ఐదారు సర్జరీలే జరిగాయన్నారు. అవసరమైన వైద్యులు, వసతులు, పడకలు లేవని, ఎప్పటిలోపు సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రికి సున్నం వేసి ఎన్నేళ్లు గడిచాయని అడిగారు. గాంధీ ఆస్పత్రికి 400 మంది వైద్యులు అవసరం ఉంది.. 2 వేల పడకలు అవసరమైతే.. 1100 కూడా లేవు. ఉస్మానియా ఆస్పత్రిలో 340 మంది వైద్యులు అవసరమైతే 250 మంది లేరు. నిలోఫర్ ఆస్పత్రిలో 170 మంది డాక్టర్లకు గాను 90 మంది కూడా లేరని వివరించారు. వైద్యుల కొరతను, సౌకర్యాల లేమి సమస్యను ఎప్పటిలోపు పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
ఆస్పత్రుల వారీగా కేటాయింపులు: రాజయ్య
ఉప ముఖ్యమంత్రి రాజయ్య బదులిస్తూ.. తాను బాధ్యతలు చేపట్టిన ఐదు నిమిషాల్లోనే గాంధీ ఆస్పత్రిని పరిశీలించానన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకొనేందుకు అన్ని ఆస్పత్రులు తిరిగామని చెప్పారు. తెలంగాణలోని ఆస్పత్రులను తాను సందర్శించానని, అక్కడి పరిస్థితులు గమనించాని తెలిపారు. దవాఖానాల్లో మౌలిక సౌకర్యాల మెరుగు కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆస్పత్రుల్లో పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరిస్తామని, వైద్యుల కొరతను త్వరలోనే తీరుస్తామన్నారు. అలాగే సిబ్బంది నియామకాలు కూడా చేపడతామని చెప్పారు. ఆస్పత్రుల వారీగా బడ్జెట్ కేటాయించిన ఘనత తమదేనని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రికి రూ.100 కోట్లు, అందులో పరికరాల కొనుగోలు కోసమే రూ.76 కోట్లకు పైగా కేటాయించినట్లు వివరించారు. గాంధీ ఆస్పత్రికి రూ.100, సరోజిని ఆస్పత్రికి 10, నిలోఫర్‌కు రూ.30 కోట్లు, పేట్లబురుజు ఆస్పత్రికి రూ.25 కోట్లు, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి రూ.25 కోట్లు, క్యాన్సర్ ఆస్పత్రికి రూ.27 కోట్లు కేటాయించామన్నారు. నిమ్స్‌కు రూ.220 కోట్లు కేటాయించామన్నారు. మొత్తవ్మిూద హైదరాబాద్‌లో ఉన్న ఆస్పత్రులకు రూ.552 కోట్లు కేటాయించామని, ఇందులో వైద్య పరికరాల కొనుగోలుతో పాటు మౌళిక వసతులు పెంచేందుకు కేటాయించినట్లు వివరించారు. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు దవాఖానాలను మెరుగుపరుస్తామని తెలిపారు.





