Tuesday, 3 November 2026

ఐటి ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి

ktr-650x345ఉద్యోగాల కల్పనలోనూ ముందున్న ఐటి రంగం
ఐటి వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌
హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రం ఐటి ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని ఐటీశాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఐటి శాఖా మంత్రి కె టి రామారావు ప్రకటించారు. బుధవారం దీనిని మంత్రి  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ 2015-16  సంవత్సరంలో రూ 75, 070 కోట్ల ఎగుమతి సాధించిందనీ , మునుపటి సంవత్సరంతోపోలిస్తే   ఇది 13.26 శాతం వృద్ధిని  నమోదు చేసిందని ప్రకటించారు.  హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో మంచి వృద్ధిరేటు సాధించామని తెలిపారు. 2014-15లో ఐటీ ఎగుమతులు రూ.67వేల కోట్లు ఉండేవని, 2015-16లో ఎగుమతులు రూ.75వేల కోట్లు దాటాయని వెల్లడించారు. జాతీయ సగటు కన్నా ఒకశాతం ఎక్కువగా వృద్ధి సాధించామన్నారు. ఐటీ సెక్టార్‌లో మంచి పురోగతి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనమన్నారు. హైదరాబాద్‌  ఐటి,ఐటి ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌ (ఐటీఈఎస్‌ ) ఎగుమతుల్లో  పెరుగుదల  జాతీయ సగటు 12.3 శాతం కంటే ఎక్కువ అని  చెప్పారు. అలాగే  మొత్తం 407, 385 ఉద్యోగాల్లో (వర్క్‌ ఫోర్స్‌) లో ఐటి రంగంలో నగరంలో దాదాపు 35, 611 కొత్త ఉద్యోగాలను సృష్టించామన్నారు.   గేమింగ్‌, యానిమేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు పాలసీలను ప్రకటించినట్లు పేర్కొన్న మంత్రి పాలనలో పారదర్శకతతో ఐటీకి పెద్దపీట వేశామన్నారు. టాస్క్‌ ద్వారా గత ఏడాది 45 వేల మందికి ట్రైనింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఐటీ సెక్టార్‌ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని ఆకాంక్షించారు. టీహబ్‌ దేశానికే రోల్‌మోడల్‌గా మారింది. డిఫెన్స్‌ సెక్టార్‌లో టీహబ్‌తో కలిసి పనిచేసేందుకు రక్షణశాఖ ముందుకు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిజిటల్‌ తెలంగాణా రూపకల్పనలో కృషిచేసిన ఐఐటి బాసర విద్యార్థుల, ఇతరవిద్యార్థులకు  ప్రతిభ అవార్డులను, నగదు పురస్కారాలను ప్రదానం చేశారు.  100 శాతం డిజిటల్‌ లిటరసీ సాధించిన బాసర, నారసింగ్‌ పూర్‌ సర్పంచులను  అవార్డులతో సత్కరించారు. నిపుణుల సలహాతో ఐటీ విధానం ప్రకటించామని, యానిమేషన్‌, గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో కూడా విధానం ప్రకటించామని చెప్పారు. మొదటి సంవత్సరం తెలంగాణ, హైదరాబాద్‌ బ్రాండ్‌ కోసం కృషి చేశాం, అన్ని దేశాలతో హైదరాబాద్‌ను బేరీజు వేసి పలు సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. యువతకు ఉద్యోగాలు రావాలని టాస్క్‌ కార్యక్రమం ప్రారంభించాం. టాస్క్‌ ద్వారా 45వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. టాస్క్‌ను బహుముఖంగా.. జిల్లాల వారీగా విస్తరిస్తామన్నారు. కేవలం హైదరాబాద్‌కే ఐటీ రంగం పరిమితం కాకూడదని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ఐటీని ద్వితియ శ్రేణి పట్టణాలకు తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తోందన్నారు. చిన్న చిన్న పట్టణాలలో కూడా రూరల్‌ బీపీవోలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వంలోని 26 విభాగాలు విస్తృతంగా ఐటీ విధానాన్ని వినియోగిస్తున్నాయని, విూసేవ ద్వారా మరిన్ని సేవలు అందించాలని కృషి చేస్తున్నట్లు చెప్పారు. విూసేవను గ్రావిూణ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ-పంచాయతీలను ప్రారంభిచామని చెప్పారు. గతేడాది లక్షమంది డిజిటల్‌ అక్షరాస్యతను సాధించారని వెల్లడించారు. సిలికాన్‌ వ్యాలీలో కూడా టీ హబ్‌ గుర్తింపు పొందిందని, సిలికాన్‌ వ్యాలీలో టీహబ్‌ ఔట్‌పోస్టును ప్రారంభిస్తామన్నారు. టీహబ్‌తో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కోలాంటి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. తెలంగాణలో మరో 500 గ్రామపంచాయతీలను త్వరలోనే ఈ-పంచాయితీలుగా మార్చనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  టీహబ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. తన అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్‌ సిలికాన్‌వ్యాలీలో టీహబ్‌

ప్రశంసలు అందుకుందన్నారు. ఎలాక్టాన్రిక్స్‌ ఉత్పత్తి రంగాల్లో పురోగతి సాధించామని తెలిపిన మంత్రి ఆ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలిపారు. సెల్‌కాన్‌, లావా, కార్బన్‌ సంస్థలు తమ రిసెర్చ్‌ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయన్నారు. తెలంగాణ విూ సేవ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఎంవ్యాలెట్‌ యాప్‌ 10 లక్షల డౌన్‌లోడ్స్‌ సాధించిందని తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా రూరల్‌ జీపీవోలు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో డిజిటల్‌ అక్షరాస్యతను పెంచడం తాము రెండో లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా 4జీ సర్వీసెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.  సామాజికరంగంలోనూ ఐటీ సేవలు ఫలితానిస్తున్నాయని తెలిపిన మంత్రి హైదరాబాద్‌లో 3 వేల పబ్లిక్‌ హాట్‌స్పాట్స్‌ ఏర్పాటు చేస్తమన్నారు. 1000 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాబోయే మూడు నెలల్లో మరికొన్ని రంగాల్లో ఐటీ సేవలు విస్తరించనున్నాయన్నారు. హార్డ్‌వేర్‌ రంగానికి ఊతమిచ్చేలా టీవర్స్‌ ప్రారంభిస్తామని వెల్లడించారు. కొత్త పుంతలు తొక్కుతున్న ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌ వినియోగించు కుంటుందని తెలిపిన మంత్రి డాటా సెంటర్‌ ఏర్పాటు ద్వారా సైబర్‌ సెక్యూరిటీ రంగానికి ఊతం ఏర్పడిందని పేర్కొన్నారు. ఐటీఐఆర్‌ విషయంలో కేంద్రం తన ఆలోచనను మార్చుకోని హైదరాబాద్‌లాంటి నగరాలకు అవకాశం ఇవ్వాలని మంత్రి కోరారు.కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ తతదితరులు పాల్గొన్నారు. డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన ముగ్గురు సర్పంచ్‌లకు అవార్డులు ప్రదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *