Tuesday, 3 November 2026

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములు కండి: మేయర్‌

GHMC-LIVE-05-640x345హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి):  స్వచ్ఛహైదరాబాద్‌లో కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కోరారు. ఎవరికి వారు ముందుకు వస్తే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛత పాటించాలన్నారు. టాటా కంపెనీ చెత్త తరలించే నాలుగు టాటా ఏస్‌ వాహనాలను జీహెచ్‌ఎంసీకి ఉచితంగా అందజేసింది.ఈ నూతన వాహనాలను మేయరు  బొంతు రామ్మోహన్‌ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ వాహనాలను పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలైన చార్మినార్‌, మక్కామసీదు, చౌమహల్లా ప్యాలెస్‌ వద్ద ఉపయోగిస్తామని మేయర్‌ చెప్పారు. చెత్తను వేయడంలో ఇప్పటికే ఇంటింటికీ బుట్టలుపంపిణీ చేశామని, అయినా రోడ్లపై చెత్త వేయడం ఎంతవరకు సబబో ఆలోచన చేయాలని అన్నారు. చెత్త రహిత నగరంగా హైదరాబ ఆద్‌ను తీర్చిదిద్దే క్రమంలో ప్రజలుకూడా సహకరించాలన్నారు. విశ్వ నగరంగా చేయాలన్న తపనకు తోడుగా రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ రవికిరణ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ సురేష్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *