Monday, 2 November 2026

ఐటీలో భవిష్యత్‌ మనదే

C

– మైక్రోసాఫ్‌ చీప్‌ సత్య నాదేళ్ల

హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి):ఐటీలో భారతీయుల నైపుణ్యాలు క్రమంగా పెరుగుతున్నాయని.. భారతీయులు త్వరలోనే ఐటీ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్య నిర్వాహణాధికారి(సీఈవో) సత్య నాదెళ్ల అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన సత్యనాదెళ్ల  హైదరాబాద్‌లోని టీ హబ్‌ను ఉదయం సందర్శించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించి టీ హబ్‌ విశేషాలను వివరించారు. అనంతరం టీ హబ్‌లోని స్టార్టప్‌ ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ… టీ హబ్‌తో మైక్రోసాఫ్ట్‌ కలిసి పనిచేస్తుందని ప్రకటించారు. భారత్‌లో యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామని తెలిపారు. స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. స్టార్టప్‌ సంస్థల అభివృద్ధిలో  సంస్కృతి, సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తాయని సత్య నాదెళ్ల అన్నారు. యువ వ్యాపారవేత్తలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నప్పుడే విజయాలు వర్తిస్తాయని సూచించారు.  భారతదేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. ఉదయం తొలుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టి-హబ్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఇతర ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు ఘన స్వాగతం పలికారు. స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించి, రాష్ట్రం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులను పెంచే లక్ష్యంతో టి-హబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. హబ్‌ విశేషాలను మంత్రి కేటీఆర్‌, ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు వివరించారు. ఆ వివరాలను ఆయన ఆసక్తిగా విని తెలుసుకున్నారు.  భారతీయుల నైపుణ్యాలు పెరుగుతున్నాయని,అది క్రమేపి ప్రపంచలోని ఐటి రంగాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందని సత్య అబిప్రాయపడ్డారు. టీ హబ్‌తో మైక్రోసాఫ్ట్‌ కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు. స్టార్టప్‌ కంపెనీల అబివృద్దిలో వర్క్‌ కల్చర్‌, సామర్ధ్యం ముఖ్యం అని ఆయన అన్నారు. యువ వ్యాపార వేత్తలను ప్రగతి పధంలో పయనించాలన్నది తమ అభిమతమని ఆయన అన్నారు. భారత్‌లో యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామని ఆయన చెప్పారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఇదిలావుంటే  హైదరాబాద్‌లో త్వరలో మెక్రోసాఫ్ట్‌ వెంచర్స్‌ ఏర్పాటు జరుగుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్లతో భేటీ అనంతరం కేటీఆర్‌ విూడియాతో మాట్లాడారు. వెనుకబడిన జిల్లాల్లో సాంకేతిక అభివృద్ధికి కృషి చేస్తామని నాదెళ్ల చెప్పారని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ శిక్షణా కార్యక్రమాలు అమలుచేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో టెక్నాలజీ అభివృద్ధికి వైట్‌పే టెక్నాలజీ ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారమందిస్తామని చెప్పినట్లు తెలిపారు. క్లౌడ్‌ టెక్నాలజీతో చిన్నతరహా పరిశ్రమల ఉన్నతి పెరుగుతుందని పేర్కొన్నారు. పోచారంలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇన్ఫోసిస్‌ సీఈవో చేతుల విూదుగా ఫిబ్రవరిలో 5 ఐటీ పాలసీల ప్రకటన చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *