ఒంగోలుకు గుండ్లకమ్మ నీరు విడుదల

ఒంగోలు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తాగునీటి అవసరాల నిమిత్తం ఒంగోలు లోని వేసవి జలాశయాలకు శుక్రవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ గుండ్లకమ్మ నీటిని విడుదల చేశారు. ఒంగోలులో నెలకొన్న తాగునీటి సమస్య దృష్ట్యా గత రెండు రోజులుగా గుండ్లకమ్మ నీటిని ఏడుగుండ్లపాడు చెరువుకు పంపింగ్‌ ద్వారా తరలిస్తున్నారు. అక్కడ నుంచి శుక్రవారం మోటార్ల ద్వారా ఒంగోలు చెరువుకు పంపింగ్‌ పక్రియ ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకట కృష్ణ, ఎంఈ సుందర రామిరెడ్డి, మాజీ చైర్మన్‌ ఎక్కల తులసీరావు, ఒంగోలు ఏఎంసీ అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు