ఒంటరి మహిళలకు పెన్షన్లు పంపిణీ

ఏలూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద సోమవారం ఒంటరి మహిళ-మత్య్యకారుల పింఛన్లను మంత్రి జవహర్‌ పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాధారాణిలు ఈ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు ప్రభుత్వంచేపడుతోందని పేర్కొన్నారు. అనేక సంఓఏమ కార్యక్రమాలను అమలు చేస్తోన్న ఘనత తమదన్నారు.శ్రీకాకుళం జిల్లా శ్రీ పోలాకి మండలంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఒంటరి మహిళా పెన్షన్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి పెన్షన్ల రూపంలో ఆదుకోవాలనే ప్రభుతం ఈ కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

 

తాజావార్తలు