ప్రకాశంను కరువు ప్రాంతంగా ప్రకటించాలి: లెఫ్ట్
ఒంగోలు,ఆగస్ట్6(జనం సాక్షి ):సిపిఐ,సిపిఎం ఆధ్వర్యంలో కనిగిరిలో సోమవారం నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. కనిగిరి నియోజకవర్గాన్ని ఆదుకోవాలని ఈ నిరసన చేపట్టినట్లు వామపక్ష నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.