హైదరాబాద్: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణెత్సవం ఈరోజు వైభవంగా జరగనుంది. ఇవాళ రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ఈ కల్యాణెత్సవం ప్రభుత్వ లాంఛనాలతో కన్నులపండువగా జరుగనుంది. కల్యాణెత్సవంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు స్వామివారిని దర్శించుకుంటారు. 4 నుంచి 6 గంటలవరకు ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నిర్వాసితులైన కాలనీవాసుల ఇళ్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ ఆహార భద్రత పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఒంటిమిట్ట ఉన్నత పాఠశాల మైదానంలో సాయంత్రం 6గంటలకు జరిగే బహిరంగసభలో చంద్రబాబు పాల్గొంటారు.




