Tuesday, 3 November 2026

ఒకేరోజు రెండు వేడుకల్లో ఒబామా!

636033147394919917వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒకే రోజు రెండు సంబరాలు చేసుకున్నారు. సోమవారం (జూలై 4) అమెరికా ఇండిపెండెన్స్ డే. ఇదే రోజు ఒబామా ముద్దుల తనయ మలియా 18వ జన్మదినం. దీంతో ఒబామా అధికార నివాసం వైట్హౌస్లో మిలటరీ వేడుకలతో పాటు మలియా బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు.

మిలటరీ వేడుకల్లో ఒబామా మాట్లాడుతూ.. దేశం కోసం సైనికులు నిరంతరం పోరాడుతున్నారని  అన్నారు. సైనికుల త్యాగం వలనే అమెరికా పౌరులు స్వేచ్ఛగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. తన కుమార్తె మలియా 18వ బర్త్ డే కూడా ఇదే రోజని ఒబామా చెప్పారు. ఒబామా కూతురి బర్త్ డే పార్టీలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా బాణసంచా వెలుగుల మధ్య వైట్ హౌస్ వెలిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *