Tuesday, 3 November 2026

ఒక ఇంట్లో 50 పాములు..

మెదక్ : మొదట ఒకటి..తరువాత రెండు..ఇంకా తరువాత మూడు..ఇలా వరుసగా 50 పాముల పిల్లలు బయటపడ్డాయి. హత్నూర మండలం సాదుల నగర్ లో ఓ ఇంట్లో పాములు బయటపడ్డాయి. మాచునూరి కృష్ణ ఇంటిలో వెలుగుచూసిన ఈ పాముల మంద గ్రామంలోనే కాక మండలవ్యాప్తంగా కలకలం రేపింది. ఇంటి ప్రధాన ద్వారం కింద పాము కనిపించడంతో కొద్దిగా మట్టిని తీశారు. ఒకటి తీసిన తరువాత మరొక పాము బయట పడింది. ఇలా ఏకంగా 50 పాము పిల్లలు బయటపడడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం ఈ పాము పిల్లలను గ్రామస్తులు చంపేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *