ఓటరు దినోత్సవం పురస్కరించుకుని 2కె రన్‌

విజయనగరం,జనవరి23(జ‌నంసాక్షి):ఈ నెల 25 ఓటరు దినోత్సవం సందర్భంగా ముందుస్తు అవగాహన కోసం 2కె రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమం  మంగళవారం ఉదయం స్థానిక విజయనగరం కోట వద్ద పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్పీ రాజశికమని జెండా ఊపి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ రాజ్‌ సీఈఓ వెంకటేశ్వరరావు, డిస్టిక్ట్‌ రెవెన్యూ అధికారి రాజకుమార్‌, డిఆర్డిఎ పీడీ సుభారావు, ఆర్‌డివో జేవి.మురళి, డిఎస్‌డివో ఆక్షసూర్యారావు, ఎన్‌ఎస్‌ఎస్‌  వాలంటరీలు. కో – ఆర్డినేటర్‌ లు , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఓటు వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటరు పేరు నమోదు చేసుకోవాలి అని ఈసందర్భంగా పిలుపునిచ్చారు.  దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఒక్క ఓటు హక్కు మాత్రమే ఉందని అన్నారు. కాబట్టి యువత ఓటు నీ నిర్లకష్యం చేయకూడదు అని ఎస్పీ రజశికమని తెలిపారు. ఓటు హక్కు వినియోగం, నమోదు పై విస్తృతంగా అవగాహన కల్పించడం జరుపుతున్నామని, ఈ 2 కె రన్‌ కార్యక్రమం ద్వారా ప్రజలోకి ఓటు విలువను తెలియజెసేందుకు కృషి చేస్తున్నామన్నారు . డిస్టిక్ట్‌ రెవెన్యూ అధికారి రాజకుమార్‌ కోట వద్ద మొదలైన రన్‌ జిల్లా పంచాయతీ కార్యాలయం వరకు సాగింది.

తాజావార్తలు