ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దు..

– చంద్రబాబు దొంగ ఏడ్పులను ఏపీ ప్రజలు నమ్మేస్థితిలో లేరు
– ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి
విజయవాడ, మే8(జ‌నం సాక్షి) : ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుకు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కె ఆంజనేయ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో సీఎం చంద్రబాబు గొంతుపై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ దేశం మొత్తం తిరుగుతున్నారన్నారు.
ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ నాయకుడు అశోక్‌ బాబు ధోరణి విపరీత స్థాయికి చేరిందని కె ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధులను విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాక అశోక్‌ బాబు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేయడం వెనక సీఎం చంద్రబాబు నాయుడి ప్రోత్సహం ఉందా? అని బీజేపీ నేత ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆంజనేయ రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం విూద ఏపీ ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలుపెడుతుందని, చంద్రబాబు దొంగ ఏడుపులను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నేత అన్నారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా మారిందని ఆంజనేయ రెడ్డి ఎద్దేవా చేశారు.

తాజావార్తలు