హైదరాబాద్ , ఆగస్టు 18 : ఓటుకు నోటు కేసులో టీ. ఏసీబీ విచారణల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ ఆదికేశవులనాయుడు కుమారుడు డీకే.శ్రీవివాస్‌తోపాటు ఆయన కార్యాలయ కార్యదర్శి విష్ణుచైతన్యకు టీ.ఏసీబీ విచారణకు హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే . ఈ మేరకు మంగళవారం టీ. ఏసీబీ ఎదుట డీకే. శ్రీనివాస్‌తో పాటు ఆయన కార్యాలయ కార్యదర్శి విష్ణుచైతన్య విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న చంద్రబాబు తనయుడు లోకేష్ డ్రైవర్ కొండల్‌రెడ్డి, జిమ్మిబాబు ఇప్పటికీ విచారణకు రాలేదు.
ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన డీకే. శ్రీనివాస్




