Monday, 2 November 2026

ఓటు గల్లంతుతో ఆత్మహత్య

కాకినాడ,ఆగస్ట్‌30 : కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు గల్లంతైందని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాకినాడకు చెందిన నానాజీ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. భార్య దీపికతో కలిసి సంధ్యానగర్‌లో నివసిస్తున్నాడు. మంగళవారం జరిగిన కార్పోరేషన్‌ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు భార్యతో కలిసి నానాజీ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాడు. అయితే జాబితాలో వారి పేర్లు లేవని అధికారులు తెలిపారు. సమయం ముగిసేవరకు పోలింగ్‌ కేంద్రం వద్ద పరిశీలించినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన నానాజీ ఈరోజు ఉదయం నిద్రమాత్రలు మింగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న నానాజీని భార్య దీపిక, లారీ డ్రైవర్‌ శ్రీనివాసరావు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.