Wednesday, 4 November 2026

ఓయూలో ఉద్రిక్తత

కోన సాగుతున్న భాష్పవాయువు ప్రయోగం
విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
అరాచకం సృష్టిస్తున్న పోలీసులు
హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ విద్యార్థులను ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను విద్యార్థులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం బయటకు తెలియకుండా ప్రత్యక్షప్రసారాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న వార్తా చానల్లకు చెందిన ఓఎఫ్‌సీ కేబుల్స్‌ను పోలీసులు కట్‌ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఓయూలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *