Monday, 2 November 2026

ఓయూలో విద్యార్థులు అరెస్టు

ou
ఉస్మానియా యూనివర్సిటి(హైదరాబాద్‌): చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. పీడీఎస్‌యూ నాయకరాలు సత్య ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటి మహిళా వసతి గృహం నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ట్స్‌ కాలేజి వద్ద ధర్నా చేస్తున్న నవ తెలంగాణ విద్యార్థి ఐకాస అధ్యక్షుడు కల్వకుర్తి ఆంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ముసావీరలతో పాటు 10మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌ వసతి గృహ నుంచి ర్యాలీగా బయలుదేరిన వివిధ సంఘాల నాయకులు కె. శ్రీనివాస్ణ్‌ొడ్‌, మానవతరాయ్‌, శరత్‌, భాస్కర్‌, శశాంక్‌లతో పాటు దాదాపు 40మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఉస్మానియా ప్రధాన గ్రంథాలయం వద్ద మరో 10మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో పోలీసులు క్యాంపస్‌ ఆవరణలోకి ప్రవేశించలేదు. ఈరోజు మాత్రం పోలీసులు వసతి గృహాల్లోకి వచ్చి అక్రమంగా విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ ధోరణికి విద్యార్థులే చరమగీతం పాడతారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో తమకు ఎన్‌కౌంటర్లు, నిర్బంధాలు, అరెస్టులు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *