కంతనపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బీజేపీ అండ
వరంగల్, సెప్టెంబర్ 3 : కంతనపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఉదయం తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కంతనపల్లి నుంచి దేవాదుల వరకు కిషన్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంతనపల్లి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు.