కడప:ఆడపిల్లలను బతకనివ్వండి
పోరుమామిళ్ల: భ్రూణహత్యలను నివారించండి ఆడపిల్లలను బతకనివ్వమని కడప ఆర్తిహోం సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశకార్యకర్తలకు భ్రూణహత్యలను నివారిద్దాం, ఆడపిల్లలను బతకనిద్దాం అనే అంశంపై అవగాహన సదస్సులో ఆర్తిహోం సభ్యులు మాట్లాడుతూ ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలన్నారు. గ్రామాల్లో భ్రూణహత్యలను అరికట్టేందుకు, ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ మొహర్ముంతాజ్, డాక్టర్ రెహ్మాన్, నోడల్అధికారి సరోజనమ్మ, హెల్త్సూపర్వైజర్ శ్రీనివాసులరెడ్డి, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.