Tuesday, 3 November 2026

కడపలో విద్యాసంస్థల బంద్‌

కడప,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): కడపలో విద్యాసంస్థల బంద్‌ పిలుపుతో అన్ని సంస్థలు మూతపడ్డాయి. శనివారం కడపలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల బందులో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కసాపురం రమేష్‌ కళాశాలలు మూసివేయించారు. విద్యార్థి సంఘాల నాయకులు, యాజమాన్యాలు సహకరించారు. బంద్‌కు మద్దతు తెలుపుతూ విద్యార్థులు కూడా బయటకు వెళ్లిపోయారు. నిన్న స్టీల్‌ఎ/-లాంట్‌ను కోరుతూ కలెక్టరేట్‌నుముట్టడించిన సమయంలో పోలీసులు అన్యాయంగా నాయకులపై లాఠీఛార్జ్‌ చేసినందుకు నిరసనగా శనివారం విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నారు.