Tuesday, 3 November 2026

కడప: డిజిటల్‌ మీడియా శిక్షణకు ఏడుగురు జర్నలిస్టులు

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌సిటీ: ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌, ఆసియా పసిఫిక్‌ సంయుక్తంగా నిర్వహించనున్న డిజిటల్‌ మీడియా శిక్షణకు ఏ డుగురు పాత్రికేయులు ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని హోటల్‌ టూరిస్ట్‌ప్లాజాలో వీరికి శిక్షణనిస్తారు. యు.ఎన్‌డి.ఇ.ఎఫ్‌ ప్రాజెక్టు ఆధ్వ ర్యంలో ప్రముఖ సాంకేతిక సంస్థ పాత్రికేయులకు డిజిటల్‌ మీడియా నైపుణ్యాలను అందిపుచ్చుకోవటంపై శిక్షణనిస్తుం దని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎం పికైన వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌, ఐదు గురు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులున్నారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *