కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో హైడ్రామా నడుస్తోంది. వైకాపా, కాంగ్రెస్ నేతలు ఈ ఉదయమే డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆరుగురు డైరెక్టర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి డీసీసీబీ సమావేశ మందిరం వద్దకు వచ్చి ఎన్నికల అధికారి రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు కార్యాలయం వద్ద కాంగ్రెస్, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదాం చోటుచేసుకొని తోపులాటు దారితీసింది. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డీసీసీబీ ఎన్నికలు నిర్వహించే అధికారి నిన్న రాత్రి నుంచి కనిపించకపోవడంతో డీసీఎంఎన్ అధికారికి ఎన్నికల నిర్వహణ బాధ్యతను కలెక్టర్ అప్పగించారు.




