కన్నకూతురినిసజీవంగానే ఖననం చేయబోయాడు!

kokfwvj8అగర్తలా : కూతుర్ని సజీవంగానే ఖననం చేయాలని ఓ కర్కశ తండ్రి ప్రయత్నించిన దారుణ ఘటన త్రిపురలో శుక్రవారం జరిగింది. నిందితుడు అబుల్ హుస్సేన్కు భార్య, ఓ కూతురు ఉన్నారు. అతడి కూతురు రుక్షీణ వయసు తొమ్మిదేళ్లు. శుక్రవారం అతడి భార్య ఓ పని మీద బయటకు వెళ్లగా ఇదే అదనుగా భావించిన హుస్సేన్.. ఇంటి వెనుక భాగంలో ఒక గుంతను తవ్వాడు.

అందులో కూతురు రుక్షీణను పాతిపెట్టాలని ప్రయత్నిస్తుండగా, ఇది గమనించిన ఓ వ్యక్తి చుట్టుపక్కల వాళ్లకు చెప్పాడు. వాళ్లు వెంటనే అక్కడకు చేరుకుని ఈ దుర్మార్గాన్ని అడ్డుకున్నారని ఎస్పీ ఉత్తమ్ భౌమిక్ తెలిపారు. నిందితుడిని శనివారం అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ఈ ఘటనలో గాయపడ్డ రుక్షీణను ఆసుపత్రికి తరలించారు. కాగా చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.