Monday, 2 November 2026

కన్నుమూసిన క్యూబా మాజీ అధ్యక్షుడు

fintel-kastroక్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో(90) శనివారం కన్నుమూశారు. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో జన్మించిన ఆయన క్యూబా అధ్యక్షునిగా విశిష్ట సేవలందించారు. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా పనిచేశారు. తుది శ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణ కోసం కృషి చేశారు.1926 ఆగస్టు 13న జన్మించిన ఆయన పూర్తి పేరు ఫిడెల్ అలెహెంద్రో క్యాస్ట్రో రుజ్.  అగ్రదేశం అమెరికాను గడగడలాడించిన  ఆయన… క్యూబాలో విప్లవోద్యమాన్ని రగిలించి పశ్చిమార్థ దేశాల్లో తొలి సామ్యవాద దేశంగా తీర్చి దిద్దారు.  క్యూబా నియంత బాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా గద్దెదింపి అధికారం చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *