కన్న కూతురికి తాళికట్టిన చండాలుడు..!

6ed9t83sకన్న కూతురికి తాళికట్టి.. రెండో భార్యని చెప్పుకున్న ఓ చండాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన 12 ఏళ్ల కూతురికి తాళి కట్టిన ఓ కసాయి తండ్రి గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అతని దారుణంపై ఫిర్యాదు చేసేందుకు భార్య కూడా ధైర్యం చేయలేకపోయింది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని భార్యను, కూతుర్ని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు చైల్డ్ లైన్ సంరక్షణ అధికారులకు, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫలితంగా ఆ కసాయి తండ్రి జైలులో ఊచలు లెక్కిస్తూ చిప్పకూడు తింటున్నాడు.