లేక మేమే తీసుకోవాలా…?
– జెఎసి చైర్మన్ కోదండరాం
శంకర్‌పల్లి, మార్చి 25 (జనంసాక్షి) : ఎంతో విలువైన శంకర్‌పల్లి మార్కేట్ యార్డు కబ్జాకు గురైనదనందున మీరే ఇస్తారా? లేక మేమే తీసుకోవాలా అని జెఎసి చైర్మన్ ప్రొఫేసర్ కోదండరామ్ కబ్జాదారులతో పాటు అధికారులను ప్రశ్నించారు. శంకర్‌పల్లి భారతీయ రైతు కిసాన్ సంఘ్ జెఎసి ఆధ్వర్యంలో బుధవారం శంకర్‌పల్లి మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కేట్ కమిటి (ఎఎంసి) ఆవరణలోని షెడ్డులో జరిగిన రైతుల మహా ధర్నాలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎఎంసి స్థలాన్ని ఒక మాజీ ఉద్యోగి కబ్జా చేసిన స్థలం మూడు ఎకరాలపై చిలుకులో దర్జాగా నంది బిల్డర్స్ పేరుతో వెంచర్ (నిర్మాణాలు)ను చేసిన విషయాన్ని విని చాలా ఆశ్చర్య పోయానన్నారు. శంకర్‌పల్లి వంటి పెద్ద వ్యవసాయ మార్కేట్ స్థలాన్ని ఎంతో సునాయసంగా ఒక ఉద్యోగి అయిన ఒక ఆంధ్ర ఆఫీసర్ రికార్డులో పేరు మార్చి, మరోకరికి అమ్మి మళ్ళీ తానే కొని వెంచర్ చేయడం ఎంత దుర్మార్గమని ఆయన ఆవేధనను వ్యక్తం చేశారు. కింది నుంచి పై వరకు అప్పట్లో అందరు ఆంధ్ర అధికారులే ఉండడం వల్లనే మార్కేట్ స్థలం కబ్జా అయ్యిందన్నారు. మొత్తం 7 – 30 ఎకరాల ఎఎంసి స్థలంలో అప్పట్లో రెండు ఎకరాలు షెడ్ల కోసం, ఒక ఎకరం ఆయిల్ మిల్‌కు లీజుకు ఇచ్చారని, అయితే అప్పటి అవసరార్దం నాలుగు ఎకరాలకు కంపౌండ్ వాల్ కట్టినంత మాత్రాన మిగిలిన స్థలం మార్కేన యాడ్‌ది కాకుండా పోతుందా అని ఆయన ప్రశ్నించారు. రికార్డుల ప్రకారం మూడు ఎకరాలలో అనుభవదిరు ఎఎంసి కాగ, హక్కుదారు గ్రామ పంచాయతీ అని ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత అన్యాయానికి పాల్పడిన సదరు ఉద్యోగిపై ఎందుకు కేసుపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఎంతో విశాలంగా, అభివృద్ది కోసం విస్థరించాల్సిన మార్కేట్ యార్డు కబ్జా కారణంగా ఇబ్బందిగా మారిందన్నారు. ఉన్నతాధికారులు కూడా మార్కేట్ యార్డ్ స్థలం కబ్జా అయ్యిందని చేబుతున్నారని, పార్టీలకతీతంగా రైతులందరు ఐక్యమత్యంతో పోరాటం చేస్తే కబ్జా స్థలాన్ని ఖచ్చితంగా పొందుతామని ఆయన అభిప్రాయ పడ్డారు. అన్ని పార్టీలు కలిసి శంకర్‌పల్లి మార్కేట్ స్థలాన్ని కపాడటానికి కమిటిగా ఎర్పడుదామని ఆయన పిలుపు నిచ్చారు. ఎఎంసి స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తి (సుబ్బారాజు)పై కేసును పెట్టి మార్కేట్‌కు న్యాయం చెయ్యాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో జెఎసి పశ్చిమరంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ స్థానిక ఎంపిపి నర్సింలు, ఎఎంసి వైస్ చైర్మన్ విఠలయ్య, వైస్ ఎంపిపి శశిధర్‌రెడ్డి, బారతీయకిసాన్ సంఘ్ (శంకర్‌పల్లి) అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ప్రకాశ్, అంజిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజిరెడ్డి, బాలకృష్ణ, అనంత్‌రెడ్డి గోవర్దన్‌రెడ్డి, పాండురంగం పలు గ్రామాల రైతులు పాల్గొని ఈ ధర్నాలో మార్కేట్ కార్యదర్శి మల్లేశం స్థలం కబ్జా విషయాన్ని మాజీ ఉద్యోగి సబ్జారాజి ఎవిధంగా కబ్జాకు పాల్పడింది, తదితర విషయాలను వివరించారు. ఎలాంటి అవాంచణీయ సంఘటనలు జరుగకుండా చేవెళ్ళ డిఎస్సీ రంగారెడ్డి, సిఐ ఉపేందర్, స్థానిక ఎస్ రేణుకారెడ్డి, పోలీసులు బందోబస్తు చేపట్టారు.
మార్కేటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టిఇకి కబ్జా విషయం : కోదండరామ్
శంకర్‌పల్లి ఎఎంసి భూమి మూడు ఎకరాల పైచిలుకు ఒక ఉద్యోగి (సుబ్జారాజు) కబ్జా చేసి వెంచర్ చేసిన విషయాన్ని రాష్ట్ర బారి నీటిపారుదల, మార్కేటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువెళ్తామాని జెఎసి చైర్మన్ ప్రొఫేసర్ కోదండరాం స్పష్టం చేశారు. బుధవారం జరిగిన రైతుల మహాధర్నా అనంతరం స్థానిక అతిధి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… 1945లో లోకల్ ఫండ్ మార్కేట్ కోసం 6-20 ఎకరాలను సేకరించిందని, అది సరిపోదని మళ్ళీ ఎకరంపైనే కొన్నారని, 1976లో రికార్డుల ప్రకారం 7-30 ఎకరాల స్థలం ఉందని వివరించారు. గతంలో స్థానిక గ్రామ పంచాయతీ ఈఓగా ఉన్న ఉద్యోగి (సుబ్బారాజు) సదరు రికార్డులను దిద్ది (మార్చి) మూడు ఎకరాలను లీజుదారు పేరున మార్చి మళ్ళీ ఖరీదు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారాన్ని ఎత్తుడాని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిని మంత్రి హరీష్‌రావుకు వివరించామని, దానికి స్పందించిన ఆయన పంచయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్‌ఎకు, రెవెన్యూశాఖ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీలకు ఈ కబ్జా విషయంలో తగిన చర్యలను తీసుకోవాలని, అలాగే సుబ్బారాజుపై చర్యలను తీసుకోవాలని కోరుతు మంత్రులకు రాశారని కోదండరామ్ వివరించారు. కబ్జాను విడిపించడానికి పోరాటాలు చేస్తామని, కలెక్టర్‌ను, మంత్రులను కలుస్తామని మార్కేట్ స్థలాన్ని దక్కించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు, జెఎసి కిసాన్ సంఘ్ నాయకులు పాల్గొన్నారు.





